సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్:హైదరాబాద్/ భీమవరం: తెలుగు రాష్ట్రాలలో పారిశ్రామిక ప్రముఖులు డాక్టర్ కె.ఎస్.ఎన్. రాజు దశదిన కర్మ (దశహం) కార్యక్రమంలో నేడు, సోమవారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్‌లో జరిగిన ఈ సంస్మరణ సభలో ఆయన దివంగత కె.ఎస్.ఎన్. రాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం వారి కుమారుడు విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కె.వి. విష్ణు రాజును ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ డాక్టర్ కె.ఎస్.ఎన్. రాజు సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. వారి మరణం కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *