సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక అని, ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు.నేడు సోమవారం భీమవరం పట్టణంలో పలు చోట్ల జరిగిన వినాయక చవితి వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. రెడ్డి కాలనీలోని మురుగు బోధి వద్ద జరిగిన వినాయక చవితి సంధర్భంగా పూజ కార్యక్రమంలోనూ, సుంకర పద్దయ్య వీధిలోని గణపతి ఆలయంలో లోనూ, రెస్ట్ హౌస్ రోడ్డులో గంగా యూత్ వారి ఆధ్వర్యంలోనూ, శ్రీరాంపురం చెట్టు కింద సాయి బాబా గుడి వద్ద శ్రీరాంపురం యూత్ వారి ఆధ్వర్యంలోనూ, రాయలం ఆర్చ్ శ్రీఆంజనేయ స్వామి గుడి శ్రీబాల గణేష్ కమిటీ ఆధ్వర్యంలోనూ, మెంటే వారి తోటలో మెంటేవారి తోట యూత్ అధ్వర్యంలో లోనూ, టు టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉప్పులూరి చంద్రశేఖర్ అధ్వర్యంలోనూ, రాయలంలోని సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *