సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో అందరు ఊహించినట్లే.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు, శనివారం జరుగుతున్నా ఎనికల్ ఓట్ల కౌంటింగ్ లో కూటమి అభ్యర్థులు విజయాల జోరులో ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.అయితే ఈరోజు కూడా కౌంటింగ్ హాలులోకి కూడా రానివ్వడం లేదని,ఓట్ల కౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని పలు చోట్ల వైసీపీ ఏజెంట్స్ ఆందోళనలు చేసారు. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా నేడు, శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు గత గురువారం పోలింగ్‌ నిర్వహించగా, నేడు, శనివారం సాయంత్రానికి పూర్తీ ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన 261 జడ్పీటీసీ స్థానాల అధికారిక ఫలితాలలో కూటమి అభ్యర్థులు 244 స్థానాలలో విజయాలు సాధించగా ప్రతి పక్ష వైసీపీ కేవలం 16 జడ్పీటీసీ లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.అలాగే ఎంపీటీసీ ఫలితాలలో 3 521 స్థానాలు కూటమి గెలుచుకోగా వైసీపీ 452 స్థానాలకు ఇండిపెండెన్స్ 80 స్థానాలకు పైగా గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నరసాపురం వైసీపీ గట్టి పోటీ మినహా దాదాపు అన్ని ప్రాంతాలలో కూటమి అభ్యర్థులు మంచి విజయాలు సాధిస్తున్నారు. తణుకు జోన్ లో కూటమి విజయవిహారమే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *