సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నైలో జరిగిన పూందమల్లి డీఎంకే శాసనసభ్యుడు కృష్ణసామి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓటమి పాలవుతుందని, ఎక్కడ గెలవదని సంచలన కామెంట్స్ చేసారు. ప్రస్తుతం బీజేపీ పాలకులకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఇప్పటివరకూ ప్రతిపక్షాలపై ఐటీ, ఈడీ సంస్థలను ఉసిగొల్పిన ఆ పార్టీ నేతలు ప్రస్తుతం ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాంపింగ్ చేసే స్థాయికి దిగజారిపోయిందని విమర్శించారు. ప్రస్తుతం దేశ ప్రజలంతా ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందా?అని ఆందోళన చెందుతున్నారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తే ఎంతటివారైన వారిని బెదరించడం, అంతటితో ఆగకుండా ఐటీ, ఈడీ దాడులు జరిపించడం ఆనవాయితీగా పెట్టుకున్నారని విమర్శించారు.
