సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం భీమవరం లో జిల్లా మలేరియా విభాగం నందు జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి యాతం నాగబాబు ఈనెల ది. 07-12-2025 తేదీన 7వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్ లో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ స్టేడియం తెలంగాణ సికింద్రాబాద్ నందు .జరిగిన ఈ క్రీడలలో మొత్తం 1254 అథ్లెట్లు పాల్గొన్నారు, అయితే భీమవరం కు చెందిన యాతం నాగబాబు 1500, మీటర్లు(,2వ స్థానం) వెండి పతకం మరియు 800, మీటర్లు (3వ స్థానం) కాంస్య పతకం & 400 మీటర్లు (3వ స్థానం) కాంస్య పతకం సాధించారు, అయన మొత్తం పరుగు పందెం నందు 3 విభాగాలు నందు పాల్గొని 1వెండి పతకాలు & 2 కాంస్య పతకం లు మొత్తం 3 పతకములు సాధించడం తో తోటి ఉద్యోగులు ఆయనకు అబినందనాలు తెలిపారు. ఆయన 2013 సII నుండి 2025 సంII వరకు జరిగిన వివిధ జాతీయ ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్ పరుగు పందెం నందు 20 బంగారు పతకాలతో సహా ఇప్పటి వరకు మొత్తం 68పతకాలు సాధించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *