సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరం డిఎన్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాల, ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ఆధ్వర్యంలో వారు దత్తత తీసుకున్న గోల్లవానితిప్ప , గ్రామంలో నిర్వహించిన 7 రోజుల ప్రత్యేక శిబిరంలో భాగంగా నేడు రెండోవ రోజు అనగా 09-12-2025 దిగ్విజయంగా ముగిసింది. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా, . గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలు: ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు మరియు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులు మరియు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. పేరుకుపోయిన చెత్తను తొలగించి, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. మురుగునీటి కాలువల శుద్ధి: దోమల నివారణ మరియు ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా మురుగునీటి కాలువలను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు.అవగాహన ర్యాలీ: “స్వచ్ఛతే సేవ” అనే నినాదంతో గ్రామస్తులందరిలో పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. బహిరంగ మల విసర్జన రహిత గ్రామం (ODF) ఆవశ్యకత గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో డిఎన్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా యం .అంజన్ కుమార్ ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ వి .ప్రవీణ్ పర్యవేక్షణలో 50 మంది వాలంటీర్లు చురుకుగా పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ చిల్లే .వేంకటేశ్వర్లు ,గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *