సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు, ఆదివారం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల కూల్చివేత బాధితులతో ఆయన సమావేశమయ్యారు. అక్కడ కూల్చివేతలు లో బాధితులుగా భావిస్తూ రూ.లక్ష చొప్పున పవన్ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు… అధికార వైసిపి పార్టీ రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? మావాళ్లను బెదిరిస్తారా? మాకు ఎవరూ అండగా ఉండకూడదా? రాజకీయం మీరే చేయాలా? మేం చేయలేమా? చేసి చూపిస్తాం ..ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొట్టి తీరుతాం ’’ అని పవన్కల్యాణ్ అన్నారు. తాను రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తామని..మాకు ఓట్లు వేసినా, వేయకపోయినా అందరికి అండగా ఉంటానని ప్రకటించారు.మాది రౌడీసేన కాదు.. విప్లవసేన యువత కోసం ఆలోచించే నేతలు పాలకులుగా రావాలని తమ జనసేన ఆశయం అన్నారు.
