సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి రాజధాని కేసు లో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నేడు, సోమవారం సుప్రీం కోర్ట్ లో ఏపీ సర్కార్ కు ఊరట లభించింది. . వివరాలలోకి వెళ్ళితే నేడు అమరావతి కేసుపై సుప్రీంలో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నల ధర్మాసనం ముందు విచారణ జరిగింది. హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి స్టే ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పాలనా నిర్ణయాలలో జోక్యం చేసుకొంటుందని రాష్ట్ర ప్రభుత్వ అభియోగంపై .. 6 నెలలలో అమరావతి లో నిర్మాణాలు పూర్తీ చెయ్యాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఎలా ఆదేశిస్తారని? మరి ప్రభుత్వం లో కాబినెట్ ఎందుకు ?ప్రశ్నించింది అని తాజా వార్తల కధనం.. . హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై తాజగా స్టే విధిస్తు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు వివరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికి సుప్రీం ఆదేశాల పట్ల జగన్ సర్కార్ లో హర్షం వ్యక్తం అవుతుంది.
