సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంత్రి అంబటి రాంబాబు నేడు, సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. తాజా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో రాజధానిని నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వ మేననే విషయం స్ప ష్టమైందని, ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో హైకోర్టు జ్యోక్యము తగదని , రాజధానుల విషయం లో హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీం వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని, ఇప్పటికైనా, చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలన్నారు. 3 రాజధానులు అడ్డంకులు సృష్టించడం మానుకోవాలన్నారు. అమరావతి రాజధాని పెద్ద స్కా మ్..నిజమైన రైతులకు ఆందోళన అవసరం లేదు. సీఎం జగన్ అభయం ఇచ్చారు. ఇక ఇటీవల జగన్ సర్కార్ ను అల్లరి చెయ్యడం పనిగా పెట్టుకొన్న పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో..రాజకీయాల్లో జీరో. ఆయనది జనసేన కాదు.. 100 సారులు అంటాను అది రౌడీసేన.. అమ్ముడిపోయిన సేన. అతనిని 4 ప్రశ్నలు వేస్తాను. నిజానికి సమాధానం ఆయనకే తెలియదు. 1. భీమవరం నుండి మరల పోటీ చేస్తారా? 2 గాజువాక నుండి పోటీ చేస్తారా? 3పాతికన్నా ఎక్క వ సీట్లలో పోటీ చేస్తారా?, 4. ఎవరి పొత్తుతో కలిసి పోటీ చేస్తారు?’ అని ప్రశ్నించారు. వీటికి సమాధానం వెంటనే చేబితే ఆయన రాజకీయ పరిజ్ఙానం ప్రజలకు, ఆయన పార్టీ సేనకు అర్ధం అవుతుంది అని ఎద్దేవా చేసారు.
