సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను నేడు, మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న టీఆరెస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన కారులో స్వయంగా షర్మిల డ్రైవ్ చేసుకొంటూ భారీ కాన్వాయ్‌తో ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల యత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోమాజిగూడ వద్ద షర్మిలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. కారులో నుంచి దిగేందుకు షర్మిల నిరాకరించారు. డోర్ లాక్ చేసుకుని కారు లోపలే ఉండిపోయారు. షర్మిల కారులోనుండే సీఎం కెసిఆర్ ఫై , టీఆరెస్ ఎమ్మెల్యేల రౌడీ ఇజం చేస్తున్నారని, మహిళాలకు రక్షణ లేదని , విమర్శలు చెయ్యడంతో .. దీంతో సోమాజిగూడ పరిసర ప్రాంతాలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు.. షర్మిల ఉన్న కారును క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీనితో హైదరాబాద్ లోని వైసిపి అభిమానులు ఆగ్రవేశాలతో ఒక్కసారిగా ఎస్ ఆర్ పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం పరిస్థితి అదుపుతప్పుతుందని గమనించిన పోలీసులు నచ్చచెప్పిన వినని షర్మిలను కారు డోరు బలవంతంగా ఓపెన్ చేసి లేడి కానిస్టేబుల్స్ సహాయంతో పోలీస్ స్టేషన్ లోకి తీసుకొనివెళ్ళారు. షర్మిలను అరెస్ట్ చేయడంతో ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు పోలీస్‌స్టేషన్‌కు భారీగా వైఎస్సార్టీపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిల నేతృత్వంలో ప్రగతిభవన్ ముట్టడికి వెళ్తున్నారనే ముందస్తు సమాచారంతో షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు ప్రకటించారు.
