సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో డి యన్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యంటి- ర్యాగింగ్ కమిటీ ఆధ్వరంలో విద్యార్థులు జీవితాలలో ర్యాగింగ్ వల్ల వచ్చే దుష్పపరిణామాలు, పర్యవసానాలు పై అవగాహని కార్యక్రమం నేడు, మంగళవారం (అనగా 29-11-2022)నిర్వహించారు దీనికి పశ్శిమ గోదావరి జిల్లా ఎడిషనల్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు ముఖ్య అతిధిగా హాజరయి.. విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ .. విద్యార్ధులు అందరు ఒకే కుటుంబం లా కలిసి మెలసి ఉండాలన్నారు. ర్యాగింగ్ చేయడం పెద్ద నేరమని ర్యాగింగ్ అనే విష సంస్కృతి వల్ల ర్యాగింగ్ గురైన విద్యార్ధి మానసిక వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇలాంటి సంఘటనలు భారత దేశం అనేక చోట్ల విద్యాలయాలలో హాస్టల్ లో చోటు చేసుకుంటున్నాయని, ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం దురదృష్టకరమని తోటి విద్యార్దుల పట్ల నైతికత లేకుండా ప్రవర్తించడం మంచి పద్దతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు ర్యాగింగ్ పాల్పడితే కేసులు నమోదు చేస్తానని, 10 ఏళ్ళ వరకు శిక్ష పడుతుందని, క్రిమినలు కేసులలో ఉన్న విద్యార్ధులకు భవిష్యత్తు లో చదువు విషయంలో ను ప్రభుత్వ ఉద్యోగ పొందే విషయంలో విదేశాలకు వెళ్ళే విషయం సమస్యలు తలెత్తి భవిష్యత్తు విచ్చిన్నమవుతుందని తెలిపారు .యీ కార్యక్రమం అనంతరం ఆయనను డి యన్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వారు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమములో భీమవరం బార్ అసోసమోషన్ అధ్యక్షులు యేలేటి నూటన్ కళాశాల పాలకవర్గ కార్యదర్శి గాదిరాజు బాబు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
