సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో శ్రీ సుబ్రమణ్య షష్ఠి వేడుకలు అన్ని శ్రీ సుబ్రమణ్య , శ్రీ నాగేంద్ర స్వామివార్ల దేవాలయాలలో నిర్వహిస్తున్న నేపథ్యంలో నేటి, మంగళవారం ఉదయం నుండి పలు దేవాలయంలలో విశేషంగా భక్తులు దర్శనాలు చేసుకొని స్వామివారికి పూలు,పండ్లు, వెండి పడగలు సమర్పించారు. ముఖ్యంగా గునుపూడి పంచ రామం లోను, శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలోనూ , మారుతి సెంటర్ లోని శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయం వద్ద భక్తుల సందడి గా ఉంది. ఇక కీలకమైన జిల్లాలోనే ఖ్యాతి గాంచిన భీమవరం శ్రీరాంపురం లో అత్యంత ఘనంగా సుబ్రమణ్య షష్ఠి ఉత్సవాలుజరుగుతాయి .తెల్లవారు జాము 4 గంటల నుండి భారీ క్యూ లైన్లలో నిలుచుని వెలది మంది భక్తులు శ్రీ రామలింగేస్వర స్వామి దేవాలయంలో దశాబ్దాలుగా మహిమానిత శ్రీ సుబ్రమణ్యేశ్వరుని దర్శించుకొని పాలాభిషేకాలు నిర్వహించారు.రేపు బుధవారం సాయంత్రం 4 గంటల నుండి ఇక్కడ 25 అడుగుల రధోత్సవం హైలైట్ గా నిలవనుంది.లైటింగ్, సే ట్టింగ్ అలంకరణలు, వందలాది చిరు వ్యాపారులతో భారీ తీర్ధం,స్వామివారి కల్యాణాలు, పల్లకి ఊరేగింపులు, ఎల్లుండి గురువారం రాత్రి తెపోత్సవాలతో ఆలయ ఆవరణలో ఆబాల గోపాలం, యువత తో మంచి సందడి వాతావరణం దృష్ట్యా పిర్యాదులు నమోదు కు పికెట్ వేసుకొని పోలీస్ లు భద్రతా ఏర్పట్లను పర్యవేక్షిస్తున్నారు.
