సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి చినబాబు కార్యలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి చెన్నమల్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తూర్పు కాపులు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సంఘీభావం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని భీమవరం, ఉండి నియోజవర్గ తూర్పు కాపు సంఘీయులు తరపున అన్నారు. తూర్పు కాపు సంఘం1972లో ఓబిసిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కూడా కేంద్ర స్థాయిలో గుర్తించడం లేదని, అన్ని రాజకీయ పార్టీలు నేటి వరకు ఈ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. బిసి డిగా ఉన్నప్పటికీ ఓబీసీ సర్టిఫికెట్ లేక పై చదువులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కేవలం 3 జిల్లాకే పరిమితం చేసి మిగిలిన జిల్లాల వారికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు కాపు సంఘంపై స్పందించి అధికారంలోకి రాగానే సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం ఆనందదాయకమని అన్నారు. బిసి మంత్రులు బొత్స సత్యనారాయణ వీటిపై ఇప్పటి వరకు స్పందించకపోవడం హాస్యాస్పదమని అన్నారు. తూర్పు కాపుల సమస్యలపై పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కు త్వరలో పాలాభిషేకం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వానపల్లి సూర్యప్రకాష్, సత్యవడ నవీన్, ,ఉండవల్లి శ్రీను, విజ్జురోతి గణేష్, ఉండి తూర్పు కాపు సంఘ సభ్యులు లక్ష్మణ్. జమ్మాది పెద్దిరాజు . రాము.తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *