సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి బుధవారం నుండి ఏపీ ప్రతిపక్ష నేత , టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లాలో వేలాదిగా తరలివచ్చిన తెలుగుదేశం క్యాడర్ ఘన స్వాగతంతో విజయరాయి గ్రామం నుండి పర్యటన ప్రారంభించారు. ఏ పర్యటనలో మాజీ ఎంపీ మాగంటి బాబు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ , తదితర కీలకనేతలు పాల్గొన్నారు. రోడ్డు షో నిర్వహిస్తూ ఆయన ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌రెడ్డి కి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు.. ఎందుకు చంపారో సీఎం జగన్ చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే డబ్బులిస్తోందని.. అయినా నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.బాబాయ్‌ని చంపినంత సులువుగా నన్నూ చంపొచ్చనుకుంటున్నారని, ఇప్పుడు లోకేష్‌ని లక్ష్యంగా చేసుకున్నారట.. వైసిపి వాళ్ళ తాటాకు చప్పుళ్లకు భయపడమని చంద్రబాబు హెచ్చరించారు. జగన్‌కు పోలీసు లు అండగా ఉంటె, తనకు అండగా ప్రజలు ఉన్నారన్నారు. అనేక కోతలతో చదువుకొనే విద్యార్థులను వారి తల్లి తండ్రులను ఇబ్బంది పెడుతూ విద్యా దీవెన అమలు చేస్తున్నారని విమర్శించారు. . గోదావరి జిల్లాల్లో పంట విరామం ప్రకటించే దుస్థితి తెచ్చారని, రాష్ట్రంలో రైతుల నెత్తిన రూ.2.75 లక్షల తలసరి అప్పు ఉందని చంద్రబాబు ఆరోపించారు.
