సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హీరో నాని నిర్మాతగా గతంలో విశ్వక్సేన్ హీరోగా నిర్మించిన హిట్ సినిమా ఓటిటి లో అందరి అభిమానాన్ని దోచుకోవడంతో ఇటీవల అడవి శేషూ హీరోగా నిర్మించిన హిట్: ది సెకండ్ కేస్ సినిమా నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిలో అడివి శేషు, మీనాక్షి చౌదరీ, రావు రమేష్, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించారు. శైలేష్ కొలను రచన దర్శకత్వం నిర్వహించారు. ఇక సినిమా కధ విషయానికి వస్తే.. ‘హిట్: ది సెకండ్ కేస్’. లో సంజన అనే అమ్మాయి హత్య అవుతుంది. ఆ హత్య నేరాన్ని పరిశోధించడానికి అధికారి కృష్ణదేవ్ అలియాస్ కేడి (అడవి శేషు)ని నియమిస్తారు. అయితే ఫోరెన్సిక్ విభాగం అధికారులు అది సంజన బాడీ కాదని తల మాత్రమే సంజన అని మిగతా బాడీ పార్ట్స్ అన్నీ వేరే వేరే అమ్మాయిలవి అని తేలుస్తారు. అది విని కేడి ఆశ్చర్యపోయి పరిశోధన సాగిస్తాడు. ఈ పరిశోధనలో అతనికి వర్ష (కోమలీ ప్రసాద్), అభిలాష్ (శ్రీనాథ్ మాగంటి) అనే ఇద్దరి అధికారులు కూడా సహాయంగా వుంటారు. వీళ్ల పరిశోధన లో రఘుని అరెస్ట్ చేసి అతనే ఈ హత్యలకు కారకుడని నిర్ధారించి ఈ కేసు మూసివేస్తారు. ఇంతలో కేడీకి ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఓ ఈ మెయిల్ వస్తుంది. ఇంతకీ అసలు హంతకుడు ఎవరు? ఎందుకిలా ఆడవాళ్లని టార్గెట్ చేసి చంపుతున్నాడు. ఇక ట్విస్టుల మీద ట్విస్టులు .. యువ దర్శకుడు శైలేష్ కొలను మొదటి సినిమా ‘హిట్’ తీశాక, అదే ఫ్రాంచైజీల కంటిన్యూ చెయ్యాలని అనుకున్నాడు. ఇప్పుడు రెండో కేసు వచ్చింది. శైలేష్ తీసే విధానం బాగుంది. ఆసక్తికరంగా అన్ని సన్నివేశాలను మలిచాడు. సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్‌లో కామెడీ కథ నడుస్తున్నంత సేపూ ఎక్కడ బోర్ కొట్టకుండా.. ప్రేక్షకుడిలో ఉత్సుకత కలిగించడంలో శైలేష్ విజయం సాధించాడని చెప్పాలి. అడవి శేషూ నటనలో చెలరేగిపోయాడు. అనుమానం లేదు మరో హిట్ కొట్టేసాడు. చివరి 20 నిముషాలు అంటే ఆల్మోస్ట్ క్లైమాక్స్‌లో కిల్లర్ ని రెచ్చగొట్టే విధానం.. ఆ సన్నివేశం బాగా వచ్చింది. అలాగే తన తదుపరి అంటే ‘హిట్:3 ది థర్డ్ కేస్’ లో ఎవరు పరిశోధన అధికారి అన్నది కూడా ఆ హీరోను కూడా ఇందులో చివర్లో చూపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *