సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి శ్రీవారి హుండీ ఆదాయం సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఈ ఏడాది ప్రతి నెల 100కోట్ల చప్పున వరుసగా తొమ్మిదో నెల హుండీ ఆదాయం రూ.100 కోట్లను దాటింది. ఈ వార్షిక సంవత్సరం (టీటీడీలో మార్చి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఏడాది క్రింద లెక్కపెడతారు )లో హుండీ ద్వారా రూ.1,000 కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ బోర్డు అంచనా వేసింది. అయితే, మార్చి నుంచి నవంబరు వరకు 9 నెలలు నెలకు రూ. 100 కోట్లు దాటి హుండీ ఆదాయం వచ్చింది. గత 9 నెలల్లోనే రూ.1,164 కోట్లను దాటేసింది. గత నవంబరు నెలలో రూ.127.30 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈ వార్షిక సంవత్సరంలో శ్రీవారికి రూ.1,600 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తుందని టీటీడీ అంచనా వేస్తున్నారు.
