సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గత దశాబ్ద కాలం పైగా కొత్త ఏడాది పండుగలు వస్తుంటే చాలు గుర్తుకువచ్చేది.. ఎంతో ఇష్టమైన, నమ్మకం కలిగిన ‘రాయల్ క్రాఫ్ట్ బజార్’ మరోసారి కొత్త ఏడాది, పండుగల కోలాహలంతో సరికొత్తగా స్థానిక నటరాజు థియేటర్ ప్రక్కన గ్రౌండ్ లో ఇటీవల నూతనంగా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి ఎందరో చేతి వృతుల కళాకారులూ రూపొందించిన కాటన్, చేనేత, కలంకారీ రంగుల వస్త్రాలు, మహిళా శారీస్, ఆధునిక డిజెన్స్, పురుషుల రెడీమేడ్ దుస్తులు, దుప్పట్లు, సోఫా క్లోత్ లు, ఫాన్సీ ,మట్టిపాత్రలు, చెక్క వస్తువులు, ఇంటిని అలంకరించే కళాత్మక అలంకార వస్తువులు, పింగాణిలు, తివాచీలు, వెదురు ఫర్నిచర్, ఇంకా ఎన్నో రకాల వస్తువులు, వస్త్రాలు దాదాపు 50 స్టాల్స్ తో భారీ ఎత్తున ఏర్పాటు చెయ్యడం జరిగింది. అతి సాధారణ ధరలతో.. హోమ్ మెడ్ తినుబండారాలుతో, చాట్ లతో పాటు,కుటుంబసమేతంగా ఆస్వాదించవచ్చు.. ఎటువంటి ఎంట్రీ పీజు లేదు, వాహనాల పార్కింగ్ ఫీజు లేదు.. వేలాది రకాల నాణ్యమైన వస్తువులు, డిజెన్ దుస్తులు తయారు చేసిన దేశీయ కళాకారుల టాలెంట్ ,నాణ్యతను వీక్షించడమే కాదు. అవసరమైన మేరకు వాటిని కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించడం..మన ఆరోగ్యం పెంచుకోవడం.`చేతి వృతి కళాకారులకు పని, ఆదాయం కలిపించగలగడం.. ఈ పండుగలవేళల మనకు అదనపు సంతృప్తి.. కాదంటారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *