సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్ల అటవీప్రాంతంలో.. అక్కడే ఉన్న స్థానికులు దానిని చూసి ఒక్కసారిగా విస్తుబోయారు.తాజగా ఆకాశం నుంచి ఆదిత్య 369 సినిమాలో ఉండే టైం మిషన్‌ తరహాలో కనిపించే ఫ్లయింగ్ సాసర్ వంటి వింత వస్తువు పెద్ద ఫాలిథిన్ కవర్ ద్వారా కిందకు సేఫ్‌గా భూమిమీద దిగటం స్థానికులు గమనించారు. . గుండ్రంగా ఉన్న భారీ వస్తువు పంటపొలాల్లో ప్రత్యక్షమవ్వడంతో స్థానికంగా అందరూ ఆశ్చర్యానికి, భయాందోళనకు గురయ్యారు. దానిలోపల మనుష్యులు కనపడలేదు అయితే కొన్ని కెమరాలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే లోపల కూర్చోవడానికి సీటు కూడా ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అ వస్తువు ఏమిటి, ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు. నాలుగేళ్ళ క్రితం కూడా ఇలాంటి వస్తువే ఒకటి వికారాబాద్ జిల్లా దోమ మండల అటవీ ప్రాంతంలో ల్యాండ్ అయ్యింది. వాతావరణ శాఖకు సంబంధించిన సామాగ్రి యంత్రం అని అప్పటిలో అధికారులు ప్రకటించారు. ఇప్పడు ఏమి చెబుతారో? గ్రహాంతర మిషన్ తరహా అసలు రహస్యం ఏమైనా ఉందా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *