సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం ( గతంలో ఎన్టీఆర్ చైతన్య రధం తరహాలో..) అన్ని ఆధునిక హంగులతో ప్రచార వాహనం సిద్ధమైంది. హైదరాబాద్ లో ఓ గ్యారేజీలో సిద్ధమైన వాహనాన్ని, ట్రయల్ రన్ ను పవన్ కల్యాణ్ నేడు, బుధవారం హైదరాబాద్లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి జనసేన పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి కొన్ని ముఖ్య సూచనలను చేశారు. వాహనాన్ని తీర్చి దిద్దిన సాంకేతిక నిపుణులతోనూ చర్చించారు. ప్రచార వాహనానికి సంబంధించి వీడియో, ఫోటోలను పవన్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ వాహనానికి ‘వారాహి’ పేరు పెట్టినట్టు పవన్ పేర్కొన్నారు. ‘వారాహి… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్.. ఎన్నికల యుద్దానికి సిద్ధం అంటూ అని ప్రకటించారు.
