సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో పరిశుద్యత లోపం జరిగితే, విధులు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన సానిటరీ సిబ్బంది ఫై చర్యలు తప్పవని మునిసిపల్ కమిషనర్ హెచ్చరించారు. వివరాలలోకి వెళితే.. నేడు, గురువారం భీమవరం పురపాలక సంఘం ప్రజారోగ్య విభాగాముకు సంబంధించి 2 వ డివిజేన్ సానిటరీ ఆఫీస్ ను ఉదయం 5.20 గంటలకు మునిసిపల్ కమీషనర్ శివరామ కృష్ణ తనిఖీ చేయగా 7 మరియు 8 వార్డ్ ల సానిటేషన్ సెక్రటరీ లు విధులకు హాజారు కాలేదని మరియు 6 వర్కర్స్ విధులకు రాలేదని గుర్తించడం జరిగినది. వీరిద్దరికి ఈరోజు జీతము నిలుపుదల చేయవలసినది కమీషనర్ వెంటనే MHO ని ఆదేశించారు.. అదేవిధముగా పట్టణ పారిశుధ్య తనిఖీ లో భాగంగా స్థానిక 7 వార్డ్ G&V కెనాల్ బండ్ క్లీనింగ్ మరియు 6 వార్డ్ రాజుల పేట పారిశుధ్య పనులను పర్యవేక్షించి డ్రైన్ క్లీనింగ్ మరియు సిల్ట్ రిమూవల్ సరిగా చేయుట లేదని గుర్తించి ఆయా వార్డ్ సెక్టరీలను మరియు సానిటరీ సూపర్ వైజర్ల ఫై తక్షణమే చర్యలు తీసుకునేలా హెచ్చరించడం జరిగినది.. ఈ కార్యక్రమము లో మునిసిపల్ కమీషనర్ సుబ్బి శివరామ కృష్ణ, MHO వేండ్ర ప్రసాద్, సానిటరీ ఇన్స్పెక్టర్ లు మరియు వార్డ్ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *