సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: .భీమవరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆలిండియా స్టూడెంట్స్ బ్లాక్, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం డ్రగ్స్ వద్దు .. ఆరోగ్యమే ముద్దు అంటూ 400 అడుగుల జాతీయ జెండాతో ఏర్పాటు చేసిన అజాద్ హింద్ ఫౌజ్ ర్యాలీ ను డిప్యూటీ స్పీకర్ రఘురామ, కృష్ణంరాజు మరియు ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. మాదక ద్రవ్యాల వ్యసనం అనేది ఒక గంభీరమైన మానసిక మరియు శారీరక స్థితి అని, ఇది మానసిక ఆరోగ్య సంబంధిత వ్యాధిగా గుర్తించబడిందన్నారు. మన దేశంలో 18-30 ఏళ్ల యువతలో డ్రగ్ వినియోగం 38 శాతమని,18–35 సంవత్సరాల మధ్య యువత గంజాయి వినియోగంతో సుమారు 1.4 లక్షలు మంది మరణిస్తున్నారన్నారు. కుటుంబంలోని తల్లిదండ్రులు పిల్లలను గమనించాలని,.యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రకాశం చౌక్, పాత బస్టాండ్ వరకు 400 అడుగుల జాతీయ జెండాతో నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, డా పీఎస్ ప్రవల్లిక, సోడిశెట్టి సాయి కృష్ణ పట్టణ పోలీస్ సీఐలు రమేష్, మురళీ కృష్ణ, వబిలిశెట్టి రామకృష్ణ, తదితరులు తో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *