సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల గత కొన్ని నెలలుగా భీమవరం పట్టణం లో పలు ప్రాంతాలలో ఒంటరిగా వెళుతున్న మహిళల మేడలో గొలుసులు లాగేసుకొని బైకులపై పరారీ అయ్యి పోతున్న యువ దొంగల పలు చైన్‌ స్నాచింగ్‌ దోపిడీ ల ఫై పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు అవుతున్నాయి, ఇటీవల ఆఖరికి స్థానిక నరసయ్య అగ్రహారంలో దేవాలయంలో సీతమ్మ వారి బంగారు తాళి బొట్టు కూడా దొంగలు అపహరించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు,, దీనిపై జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ గత ఆదివారం మీడియాతో మాట్లాడుతూ,.. ఇటీవల గంజాయి కేసులతో పాటు కొన్ని ప్రాంతాల్లో చైన్‌ స్నాచింగ్‌ కేసులు పెరిగాయని, దీనిపై ఇకపై పూర్తీ స్థాయిలో ద్రుష్టి పెడుతున్నామని ,చైన్‌ స్నాచింగ్‌ దొంగలపై పోలీస్ నిఘా పెడతామని (మన సిగ్మా న్యూస్ లో వచ్చింది)ఇలా ప్రకటించి 24 గంటలు కాలేదు.. గత సోమవారం రాత్రి భీమవరం టు టౌన్ లోని శ్రీరాంపురం లో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా సందులో ఒంటరి మహిళ రోడ్డుపై వెళ్తుండగా ఆమె మెడలోని నాలుగు కాసులు పైగా బంగారపు తాడును బైకు పై వెళుతూ చెయిన్  స్నాచర్స్ లాక్కుని దొంగిలించారని 2 టౌన్ పోలీసులకు పిర్యాదు అందటంతో వెంటనే సిఐ కృష్ణ కుమార్ తన సిబ్బంది తో ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని విచారణ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *