సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చైనా లో మళ్లీ కరోనా మహమ్మా రి విజృంభిస్తుం డటంతో.. మన దేశంలో కొత్త రకం ఒమిక్రాన్ వైరస్ కేసులు ప్రవేశించాయని నిర్ధారణ అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గత 24 గంటల వ్య వధిలో దేశవ్యాప్తంగా 185 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నేడు గురువారం మధ్యాహ్నం ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్న తస్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సహా ఇతర ఉన్నతాధికారులు దీనిలో పాల్గొననున్నారు. కొవిడ్ పూర్తిగా అంతరించిపోలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఈసందర్భంగా సూచించింది. కొత్త వేరియంట్లు వస్తుండడం , కిస్మస్, సంక్రాంతి పండుగలు సమీపిస్తుండడంతో కేసులపై గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించింది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ లు ధరిం చాలని ప్రజలను సూచించింది. చైనా సహా కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్ పార్టీలలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు వెలువడ్డాయి.
