సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మార్చి నెలలో జరగనున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి సం బంధించిన ఈ అవార్డుల వేడుకలో పోటీ పడనున్న సినిమాలు షార్ట్ లిస్ట్ ను తాజాగా నేడు, గురువారం అకాడమీ ప్రకటించింది. ఈ జాబితాలో పేరు సొంతం చేసుకున్న చిత్రాలకు ఓటింగ్ పెట్టి వచ్చే నెలలో నామినేషన్స్ ను ప్రకటించనున్నారు. అయితే దీనిలో నాలుగు భారతీయ చిత్రాలు వివిధ విభాగాలలో స్థానం సంపాదించాయి. ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో Last Film Show , ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ (RRR) నుంచి ‘నాటునాటు’,తెలుగు పాట స్తానం సంపాదించాయి. ( ఈ పాట ఇటీవల యుద్ధ రంగంగా మారిన.. ఉక్రెయిన్ దేశంలో గతంలో చిత్రీకరించడం మరో విశేషం..)ఇక ఉత్తమ డాక్యు మెంటరీ ఫీచర్ విభాగంలో ‘ఆల్ దట్ బ్రీత్స్ ’, ఉత్తమ డాక్యు మెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెం ట్ విష్పరర్’ ఈ జాబితాలో చోటు సొంతం చేసుకున్నాయి. ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఆ ఓటింగ్ను ఆధారంగా చేసుకుని జనవరి 24న ఆస్కార్ నామినేషన్లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. తదుపరి మార్చి 12న విజేతలకు ఆస్కా ర్ అవార్డ్స్ అందజేస్తారు.
