సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో కేంద్రఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ నేడు, శనివారం ఉదయం కోవిడ్ ఫై సమీక్ష నిర్వ హిం చారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. ఇకనుండి చైనా, దక్షిణకొరియా, జపాన్, హాంకాంగ్, థాయ్లాండ్ నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేశారు. పరీక్షల్లోవీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే క్వా రంటైన్ సెంటర్కుతరలిస్తారు. అలాగే దేశం లో ఆక్సి జన్ సిలిండర్ల లభ్య తపైనా కేంద్రం ఆరా తీసిం ది. ఆస్ప త్రుల్లోఆక్సిజన్ సిలిండర్ల విషయంపై ప్రతివారం సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. హాస్పిటల్స్ లో లిక్విడ్ ఆక్సి జన్ అం దుబాటులో ఉండాలని ఆదేశించింది. ఇప్పటికే కొన్ని హాస్పటల్స్ లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సరిగా పనిచేస్తున్నా యా లేదో మాక్ డ్రిల్ విర్వహించాలంది. ఆక్సిజన్ డిమాండ్ సరఫరా వినియోగంపై ప్రత్యేక యాప్ నిర్వహించాలని లేఖలో ఆదేశించింది.
