సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో లో వరుసగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు(78) నేడు, ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో చలపతిరావు జన్మించారు. చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1,200 పైగా సినిమాలలో చలపతిరావు నటించారు. దానవీర సూరకర్ణ సినిమాలో ఏకంగా 5 పాత్రలు పోషించి ఎన్టీఆర్ తో శబాష్ అనిపించుకొన్న విలన్ గా కూడా హీరోయిన్ తో 100 కు రేప్ సన్నివేశాలలో పాల్గొన్న ఏకైక ప్రపంచ విలన్ గా అరుదయిన రికార్డు సాధించారు. నిన్నే పెళ్లాడతా సినిమాలో హీరో నాగార్జున తండ్రి గా, ఆది , చెన్నకేశవరెడ్డి సినిమాలతో మంచి స్థాయి నటుడిగా ఎదిగారు. నటుడు, నిర్మాతగా చలపతిరావు గుర్తింపు పొందారు. నిర్మాతగా 7 సినిమాలను చలపతిరావు నిర్మించారు. తెలుగు సినీ ప్రముఖులు చలపతి రావు మృతి కి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.
