సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో 2 విడుత మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుంది. కోర్టు వివాదాలు పరిష్కారం కావడంతో.. పలు పురపాలక సంఘాలతోపాటు వివిధ నగరపాలక సంస్థలకు పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నేడు బుధవారం నిర్ణయించింది. నవంబర్ 26వ తేదీన పంచాయితీ ఎన్నికలు మొదటి దశ పోలింగ్ జరగనుంది. అదే రోజు ఈ నగరపాలక సంస్థలతోపాటు 23 పురపాలక సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ సిద్ధం అవుతున్నారు. ఈ నవంబర్ 13వ తేదీన అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం,(ఈసారిమున్సిపాలిటీ కి చుట్టుపక్కల గ్రామాలు విలీనంతో గ్రేటర్ భీమవరం స్థాయిలో మునిసిపాల్ ఎన్నికలు) తాడేపల్లి గూడెం, పాలకొల్లు, తణుకు చింతలపూడి మున్సిపాలిటీ లకు మరియు శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆముదాలవలస, రాజాం, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నర్సరావుపేట, బాపట్ల, కందుకూరు, పొదిలి, కావలి, గుడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బీ కొత్తకోట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *