సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నేడు, మంగళవారం తెలుగు రాష్ట్రాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ మొక్కలు నాటి`ప్రక్రుతి కాపాడుకోవాలని ఇచ్చిన పిలుపుమేరకు..వైసిపి అభిమానులు ఈ సంవత్సరం ప్రధానంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో భీమవరం స్థానిక వైసిపి కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు ప్రకటించగా.. అభిమానులు ఆయన కటౌట్ కు పుష్పబిషేకంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పధకాల వివరాలుతో పుస్తకాల పంపిణి,మిఠాయి పంపిణి చేసారు. భీమవరం నియోజకవర్గంలో వాడవాడలా జగన్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు మొక్కలు పంపిణి, మొక్కలునాటడం, మిఠాయి పంపిణి, హాస్పటల్స్ లో రోగులకు ఫండ్లు,పాలు పంపిణి, పేదలకు వస్త్రాల పంపిణి వంటి ప్రజోపకార్యక్రమాలు చేపట్టారు. భీమవరంలో ప్రముఖ వైసిపి నేతలు, ప్రజాప్రతినిదులు నేడు, తణుకులో సీఎం జగన్ పర్యటనలో పాల్గొనేందుకు తరలివెళ్లారు. “
