సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతిష్టాకరంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులలో నిధుల కొరతతో ఇటీవల కొంత సబ్దత వచ్చినప్పటి తాజాగా పనులు ప్రారంభం అయ్యాయి. తాజగా జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం డ్రాఫ్ట్ ట్యూబ్ బిగించే పనులకు అధికారులు పర్యావేక్షణలో ఏపీ జెన్కో, మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులు, అధికారులు పనులను ప్రారంభించారు. విద్యుత్ కేంద్రం తొలి యూనిట్లో డ్రాఫ్ట్ ట్యూ బ్ బిగింపు పనులు చేపట్టారు. ఈ విద్యుత్ కేంద్రంలో 12 యూనిట్లున్నాయి. 960 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని నిర్మించనున్నా రు. పోలవరానికి వచ్చే నీరు విద్యుత్కేంద్రం లోని టర్బయిన్లపై పడుతుంది. టర్బయిన్ తిరగడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. దీనికి వినియోగించిన నీటిని బయటకు పంపేందుకు డ్రాఫ్ట్ ట్యూ బ్ లు ఉపయోగపడతాయి.
