సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉదయం భీమవరం నియోజకవర్గ సచివాలయ కన్వీనర్లు మరియు గ్రామ వార్డు వాలంటీర్ల “ఆత్మీయ సమావేశం’. భీమవరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో నిర్వహించారు. .ఈ సమావేశంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన సభలో మాట్లాడుతూ.. ప్రస్తుతం సీఎం జగన్ ఏర్పాటు చేసిన సచివాలయం, వాలంటీర్లు వ్యవస్థ దేశానికీ ఆదర్శం అయ్యిందని, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా సచివాలయ ఉద్యొగులు, వాలంటర్స్ ప్రజా సేవల్లో చక్కగా మమేకం అయ్యారని , దీనిపై పచ్చబ్యాచ్ ఓర్వలేకపోతుందని విమర్శించారు. గతంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటైనా నెరవేర్చారా? సీఎం అయ్యాక ఎవరికైనా కొత్తగా వృదులకు పెంక్షన్ ను ఇచ్చారా? రైతుల రుణాలు రద్దు చేసారా? నిరుద్యోగ భృతి 2000 ఇచ్చాడా? పింఛను కోసం అప్లికేషన్ రాయడానికి కూడా 50 రూపాయలు తీసుకోని రాసి ఇచ్చి తరువాత దానిని చెత్త బుట్టలో వేసేవారని విమర్శించారు. ఎవరికీ కొత్తగా పింఛను ఇవ్వకుండా ఎవరైనా చనిపోతేనే వారి స్థానంలో కొత్త పెంక్షన్ ఇచ్చే దోర్భగ్యం ఉండేదని , ఆయన హయాంలో జన్మభూమి కమిటీలు ద్వారా టీడీపీ నేతలు తీవ్ర అవినీతి తో ప్రజల పధకాలను దోపిడీ చేసేవారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సీఎం జగన్ చేప్పట్టిన ప్రజా సంక్షేమ పధకాలను అన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని ప్రజలు దీనిని గమనించి, సీఎం జగన్ డైరెక్ట్ గా లబ్దిదారులయిన ప్రజలు అకౌంట్ లో 1 లక్ష 30వేల కోట్లు వేశారని ఇలాంటి నిజాయితీ నాయకుడి పక్షాన ప్రజలు నిలబడాలని మరోసారి సీఎం చెయ్యాలని పిలుపు నిచ్చారు.
