సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గాంచిన ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సా ప్’ తన ట్వి ట్టర్ ఖాతాలో భారత్ మ్యాప్ ను తప్పు గా చూపించే గ్రాఫిక్ చిత్రాన్ని పోస్టు చేయడం పై ఆ సంస్థపై భారత్ తాజగా నేడు, శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ పటంలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, చైనా తమదేనని చెబుతున్న ప్రాంతాలులేని భారత చిత్రపటాన్ని పంచుకుంది వాట్సాప్. ఈ ఘోరమైన తప్పిదంపై కేంద్రం ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరికలు చేశారు. జరిగిన తప్పు ను వెంటనే సరిదిద్దాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కో వలసి వస్తుందని హెచ్చరించారు. ‘డియర్ వాట్సాప్.. భారత మ్యా ప్లో తలెత్తిన తప్పును వెంటనే సరిదిద్దాలని కోరుతున్నాం . భారత్లో వ్యాపారం చేస్తున్న అన్ని సంస్థలు, ఇకముందు వ్యాపారం కొనసాగించాలనుకుంటున్న సంస్థలు తప్ప నిసరిగా సరైన మ్యాప్ను వినియోగించాలి. ’అని ట్విట్టర్లో వాట్సాప్ పోస్టును రీట్వీ ట్ చేశారు . వాట్సాప్ పోస్ట్ చేసిన కొద్ది గం టల్లోనే జరిగిన తప్పు ను గుర్తించిన మంత్రి వెంటనే మెటాకు ఫిర్యాదు చేశారు.
