సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం నియోజవర్గ ప్రజలకు నూతన సంవత్సర వేడుకల శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ రఘురామా కృష్ణంరాజు నేడు, ఢిల్లీ లో మీడియా తో మాట్లాడుతూ.. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడపడానికి కొత్త అప్పులకు జగన్ సర్కార్ ఎదురుచూస్తోందని, ఏపీలో ప్రభుత్వ పథకాలకు సరిపడా నిధులు ఇక లేవని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మినహా వేరే ఆప్షన్ కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న జగన్ హామీ కూడా నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు.సంవత్సరం మూడు నెలల తర్వాత రావలసిన ఎన్నికలు, అతి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. జూలై, ఆగస్టు మాసాలలో ముందస్తు ఎన్నికలు వస్తాయని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా, ప్రజా పక్షం వహించి ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఇప్పటి కైనా సీఎం జగన్ ఆయనకు వాస్తవాలు చెపుతున్నవారి పట్ల కక్ష మానుకోవాలని , ప్రజల పట్ల తన పద్ధతి మార్చుకోవాలని జగన్‌కు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.
