సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూ ల్ ముందు అనుకున్నట్లు ఏప్రిల్ నెలలో కాకుండా ఫిబ్రవరి నెలలోనే నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ముందు షెడ్యూలు ప్రకారం ప్రస్తుతం మార్చిలో థియరీ పరీక్షలు ముగిశాక ప్రాక్టికల్స్ ఉండగా వీటిని ముందుగానే నిర్వహించాలని భావిస్తున్నారు. నిజానికి ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్15 నుంచి మే10 వరకు రెండు విడతలుగా నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూ ల్ విడుదల చేశారు. అయితే మే వరకు ప్రాక్టికల్స్ ఉండడంతో ఎం సెట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులకు సమయం సరిపోదని,పైగా ఫలితాలు విడుదల చాల ఆలస్యం అవుతుందని విద్యా ర్థులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. పరీక్షల షెడ్యూ ల్ను మార్చాలని కళాశాలల యాజమాన్యాలు ఇంటర్ బోర్డు కి చేసిన విన్నతులకు పరిష్కారం లభించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *