సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: 7-1-2023, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో .. ఆటోలలో ప్రయాణిస్తూ మిగతా ప్రయాణికులను ఏమార్చి దొంగతనాలు చేసే కిలాడీ లేడిని అరెస్టు చేసి ఆమె చోరీ వివరాలు వెల్లడించారు. తణుకు పట్టణానికి చెందిన నల్లం చక్రధరరావు భార్య గత డిసెంబర్ నెల 28న తణుకు నుంచి వేల్పూరు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. అదే ఆటోలో సాధారణ ప్రయాణికురాలిగా ఆకివీడుకు చెందిన మేకల పోచమ్మ ఎక్కింది. పక్కనే ఉన్న చక్రధరరావు భార్య హ్యాండ్ బ్యాగులో ఉన్న 247 గ్రాముల బంగారు నగలను దొంగిలించి వీరభద్రపురం వద్ద దిగిపోయి కారులో పరారైంది. బాధితులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం .రాజకుమార్, సీఐ ఆం జనేయులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని శుక్రవారం వేల్పూ రు బైపాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసి ఆమెవద్ద నుండి రూ. 12 లక్షల విలువైన 247 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు.. నిందితురాలిపై గతంలో భీమవరం వన్ టౌన్,గుడివాడ టూటౌన్, ఆకివీడు, ఆచంట పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు నేరాలకు పాల్ప డినట్లు కేసులు ఉన్నా యనిఎస్పీ ప్రకటించారు. ఆమెకు సహకరించిన బం డి దుర్గ, మహేష్ లను కూడా పట్టుకొంటామని తెలిపారు.
