సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 10 పరీక్షా కేంద్రాలలో APPSC రేపు ఆదివారం (జనవరి 8 వతేదీ) నిర్వహిస్తున్నారు. కేజీఆర్‌ ఎల్‌ కళాశాల, డీఎన్‌ఆర్‌ కళాశాల, విష్ణు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, విష్ణు మహిళ ఇంజనీరింగ్‌ కళాశాల, వీఎస్‌కే డిగ్రీ కళాశాల, కేజీఆర్‌ఎల్‌ కాలేజ్‌ పీజీ కోర్స్‌స్‌ కళాశాల, డాక్టర్‌ సీఎస్‌ఎన్‌ డిగ్రీ, పిజీ కళాశాల, ఆదిత్య డిగ్రీ కళాశాల, కేజీఆర్‌ఎల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ కళాశాల, బ్రౌనింగ్‌ జూనియర్‌ కళాశాలలో పరీక్షలుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసారు . జిల్లా కోఆర్డినేషన్‌ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి దాసి రాజు మీడియాతో మాట్లాడుతూ.. రేపు పరీక్షా కేంద్రంలలోకి అభ్యర్థుల ను ఉదయం 9:00 గంటల నుంచి 9:45 నిమిషాల వరకు, మధ్యాహ్నం 1:00 గంట నుంచి 1:45 నిమిషాల వరకు మాత్రమే అనుమతిస్తారన్నారు. తదుపరి వచ్చేవారిని పరీక్షా కేంద్రంలోనికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డు (ఆధార్‌ కార్డు/ పాన్‌ కార్డు/ ఓటు గుర్తింపు కార్డు/ డ్రైవింగ్‌ లైసెన్సు) వెంట తెచ్చుకోవాలన్నారు. సెల్‌ఫోన్స్‌, కాలిక్యులేటర్‌, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, హ్యాండ్‌ బ్యాగ్‌లను అనుమతించరన్నారు. కొవిడ్‌–19 నిబంధనలు విధిగా పాటించాలన్నారు. అభ్యర్థులకు సందేహాలు ఉంటే కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ నెంబరు 08816–299189 లో సంప్రదించాలన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *