సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణ సుంద్రీకరణ లో భాగంగా వన్ టౌన్, టూ టౌన్, 3 టౌన్ లలో స్ట్రిప్ రోప్ లైటింగ్ సౌకర్యాలను రూ ఐదు లక్షలు నిధులతో ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు వన్ టౌన్ లోని ఓవర్ బ్రిడ్జి పై ఏర్పాటుచేసిన స్ట్రిప్ రోప్ లైటింగ్ ను నేడు, శనివారం రాత్రి ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ తన కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమవరం పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ రాష్ట్రస్థాయిలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. భీమవరం జిల్లా కేంద్రం కావడంతో ఈ పట్టణాన్ని మెట్రో సిటీ తరహాలో అభివృద్ధి చేసే విధంగా కూడా కార్యాచరణ చేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా జిల్లా కేంద్రం కావడంతో నిత్యం జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వ జిల్లా కార్యాలయాల కు వివిధ పనుల నిమిత్తం వస్తున్న నేపథ్యంలో వారికి పట్టణంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కుల అభివృద్ధిని కూడా వేగవంతంగా చేస్తున్నామని అన్నారు.
