సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వర్గీయ త్యాగరాజ్య స్వామివారి 175వ జయంతి సందర్భముగా నేడు, ఆదివారం నుండి భీమవరం పట్టణంలో శ్రీ త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ‘104వ ఆరాధనోత్సవాలు నేటి ఆదివారం సాయంత్రం 6గంటల నుండి స్థానిక ఆర్యవైశ్య భవనంలో (త్యాగరాజ భవనం లో) ప్రారంభిస్తున్నారు. 5 రోజుల పాటు ప్రతి రోజు సాయంత్రం 6. 30 నిమిషాల నుండి నిర్వహించే ఈ కార్యక్రమాలలో ప్రముఖ సంగీత , వాయిద్య , నృత్య కళాకారులు ,తమ ప్రదర్శనలు తో ఆహుతులను అలరించనున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు త్యాగరాజ భవనంలో ప్రదర్శనలు ఉంటే 11, 12 తేదీలలో ఏ ఎస్ ఆర్ నగర్ లోని శ్రీ అల్లూరి సీతారామరాజు సాంసృతిక కేంద్రంలో నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *