సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో సంక్రాంతి పర్వదినాలలో మొదటిదైన బోగి పండుగ నేటి శనివారం తెల్లవారు జాము నుండి ప్రారంభమయింది. శీతాకాలపు మంచు తెరల మధ్య వాడవాడల బోగి మంటల వెలుగులతో సంక్రాంతి శోభ వెళ్లి విరిసింది. దేవాలయాలలో వేదమంత్రాల ఉచ్చరణలు చెవిని తాకుతుంటే.. ఒక ప్రక్క భోగిమంటలు వెలుగులు వెచ్చదనాలు, తమ కుటుంబాల మూలాలు వెతుక్కొంటూ వచ్చే కుటుంబసభ్యుల, ఆబాల గోపాలం ఆప్యాయతలు విలువలు,వినోదాలు మధ్య తెలుగువారికి మాత్రమే ప్రత్యేకమైన అనుభూతులు నేడు ఈ బోగి మంటల వెలుగులు ప్రతిబింబించాయి. ఫై చిత్రం భీమవరంలోని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటి ఆవరణలో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *