సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి కి భీమవరం పట్టణం ఈ సారి గతంలో కన్నా జోరుగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. భీమవరం పట్టణం అంతా దూరప్రాంతాల నుండి వస్తున్నా ఆధునిక వాహనాలు వీఐపీ ల జోరులో సందడిగా ఉంది. ఎందరో వ్యాపార, సినీ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాలలో సుపరిచితులయిన ప్రముఖ జూదగాళ్లు, వారి బౌన్సర్లు హడావిడి తో సందడిగా ఉంది. తెలుగు రాష్ట్రాలలోనే కోడి పందాలు రాజధాని గా పేరొందిన భీమవరం పరిసర గ్రామాలలో, అటు ఉండి ఆకివీడు వరకు, ఇటు పాలకొల్లువరకు ఏ మాత్రం తగ్గేదే లే అన్న రీతిలో సందడి మొదలయింది. ఇక రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గ్రామీణ క్రీడలకు ఈ సారి పెద్దపీట వేశారు.పురుషులు, మహిళల కబాడీ పోటీలకు ఆధునిక హంగులతో ఫ్లడ్ లైట్స్ వెలుగులలో సైతం నిర్వహిస్తున్నారు. దుంపగడప లో కబాడీ పోటీలకు శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు ముఖ్య అతిధిగా హాజరుకాగా, భీమవరం మండలం యన్మదుర్రు సంక్రాంతి పండుగ సందర్భంగా యనమదుర్రు గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భీమవరం డిఎస్పి శ్రీనాథ్ గారు,డిసిఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి తదితర ప్రజాప్రతినిధులు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *