సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. గోశాల వద్ద సంక్రాంతి వేడుకల సెట్ నిర్మించారు. గ్రామీణ వాతావరణం కనిపించేలా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి తెల్ల పంచె కండువా ధరించి సంప్రదాయ వస్త్ర ధారణతో సీఎం జగన్, ఆయన సతీమణి భారతి హాజరయ్యారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ముఖ్యమంత్రి తిలకించారు. సీఎం జగన్ పావురాలను ఎగుర వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ అందరికీ మంచి జరగాలని.. శుభాలు కలగాలని.. భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *