సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల వివాదాలలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు అయినా కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌ను గత శనివారం రాత్రి బీఆర్ అంబేడ్క ర్ కోనసీమ జిల్లా నగరం పోలీ్‌సస్టేషన్ వద్ద పోలీసులు అడ్డగించారు. భీమవరం నుంచి కాకినాడ వైపుగా వెళుతుండగా ఆయనతో పాటు అనుచరులు ప్రయాణిస్తున్న 4 వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులు, నగదు కనిపించలేదు. ప్రవీణ్, అతని అనుచరుల అడ్ర్‌సలు నమోదు చేసుకుని వారిని వదిలిపెట్టారు. దీనిపై చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. పుణ్యక్షేత్రాలకు వస్తే పోలీసులు అడ్డగించి వాహనాలు తనిఖీ చేశారని ఆగ్రహించారు. ఆంధ్రాకు రావాలంటే ఈసారి పాస్‌పోర్టు తీసుకుని అడుగుపెడతానని ఎద్దేవా చేశారు. నిజానికి చికోటి ప్రవీణ్ ఆయన అనుచరులు వాహనాలలో ఈ నెల 13వ తేదీనే పండుగ కు ఒక రోజు ముందు భీమవరం చేరుకొని ఇక్కడ పర్యటించారు. నిన్న భీమవరం సంక్రాంతి సరదాలలో పాల్గొని కాకినాడ వైపు వెళుతుండగా ఈ ఘటన జరగటం గమనార్హం..
