సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు లో సుకుమార్ రూపొందించిన ‘ పుష్ప’ పాన్ ఇండియా సినిమాగా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.. , తగ్గేదేలే .. అంటూ అల్లు అర్జున్ విదేశాలలో కూడా అభిమానులను సంపాదించుకొనేలా చేసిన పుష్ప విజయం కొనసాగింపుగా ఏడాది విరామం తరువాత పుష్ప 2 షూటింగ్ ఇటీవల విశాఖ పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతుంది. ఇప్పడు పుష్ప కు అదనపు ఆకర్షణగా జగపతి బాబు కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ జగపతి బాబు కు ‘ నాన్నకు ప్రేమతో.. రంగస్థలం లో హీరోల రేంజ్ కు ఏ మాత్రం తగ్గని విభిన్న ప్రతి నాయకుడిగా గొప్ప స్థానంలో నిలబెట్టారు. ఈ పుష్ప లో కూడా సినిమాకు హైలైట్ గా నిలచే పాత్రలో జగ్గుబాయి కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే జగపతి బాబు ఫై సన్నివేశాలను సుకుమార్ చిత్రీకరిస్తున్నారు. మరి కొద్దీ రోజులలో అల్లు అర్జున్ తో జగపతి కాంబినేషన్ సన్నివేశాలు కూడా షూట్ చేస్తారని సమాచారం.. సరియిన పాత్ర పడితే జగపతి బాబు ఎలా చెలరేగుతాడో బసిరెడ్డి పాత్రలో నిరూపించారు.ఇకపై పాన్ ఇండియా రేంజ్ లో జగపతి తనదయిన నట విశ్వరూపంతో విలయతాండవం చేస్తారన్నమాట
