సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం శివారు ప్రాంతాలలో ఇటీవల ఆకతాయి యువకుల దూకుడు ఎక్కవ అవుతున్న ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. గత బుధవారం సాయంత్రం భీమవరం నుండి ఉండి వైపు వెళ్తున్న విద్యార్థినులతో వెళుతున్న కాలేజీ బస్సును ఉండి మసీదు మలుపు వద్ద సినిమా స్టైల్ లో జీపును అడ్డంగా పెట్టి ఆపారు. కొందరు యువకులు బైకులు అడ్డంగా పెట్టి అటకాయించి తరువాత ఇదేమిటి? అని అడిగిన బస్సు డ్రైవర్ను కొట్టి, కొందరు విద్యార్థినులకు వేధించడంతో… తదుపరి, స్థానికులు విద్యార్థినుల కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చి యువకులను కూడా కొట్టడం జరిగిందని సమాచారం.. ఈ వ్య వహారంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో గత బుధవారం రాత్రి కళాశాల బస్సులో ప్రయాణిస్తున్న టీచర్ ఇచ్చి న ఫిర్యాదు మేరకు ఎస్సై గంగాధరరావు కేసు నమోదు చేసి మొత్తం 10 మంది యువకులలో ఇద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకున్నామని మిగతా వారు పరారీలో ఉండటంతో వారిని కూడా అదుపులోకి తీసుకొంటామని పోలీసులు తెలిపారు.
