సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2 నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుండి ఈ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. నేడు, శుక్రవారం వేకువజామున 2.48 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమై.. 6.30 గంటలపాటు కొనసాగింది. అనంతరం ఉదయం 9.18 గంటలకు షార్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ-డీ2 నింగిలోకి బయలుదేరింది. తదుపరి కొంత సమయం తరువాత ప్రయోగం విజయవం తమైనట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎస్ఎస్ఎల్వీ-డీ2 ద్వా రా ఇస్రోకు చెం దిన 156.3 కిలోల బరువుగల ఈవోఎస్-07 ఉపగ్రహం తో పాటు యూఎస్ఏ అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్కిడ్జ్ ఇండియా ఆధ్వర్యం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను 450 కిలోమీటర్లు ఎత్తులో భూసమీప కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ భారత్ విజయం ఫై సీఎం జగన్ , ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటనలు విడుదల చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *