సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఉండి రోడ్ లో నేటి శనివారం ఉదయం స్థానిక పుష్ప పెట్రోల్ బంక్ పరిధిలోకి ప్రయాణికులతో వెళుతున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పెట్రోల్ బ్యాంకు లోకి దూసుకొని వెళ్లే ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న డివైడర్ అడ్డుతగలడం తో అక్కడే డ్రైవర్ బస్సును అదుపుచెయ్యగలిగాడు. లేకపోతె కొద్దీ సెంటీమీటర్స్ దూరంలో కరెంట్ స్తంభం ను ఢీ కొంటె మాత్రం ..అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ .. ఘోర దుర్ఘటన జరిగిఉండేది.. సంఘటన ఏరియా పరిశీలించిన పోలీసులు ఆర్టీసీ అధికారులు గట్టిగ ఊపిరి తీసుకొంటున్నారు. బస్సు అదుపుతప్పడానికి కారణాలు డ్రైవర్ నిర్లక్షత ,అసమర్ధత లేక బ్రేకు లు ఫెయిల్ అవ్వడమా ?అన్న కోణంలో దర్యాప్తు జరుగుతుంది.
