సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో వేలాది మంది విద్యార్థినులు తో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జరిగిన సమావేశం చాలా ఆసక్తి కరంగా జరిగింది. వేదికపై చైర్మెన్, విష్ణు రాజు తో అస్సినులయిన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. దేశంలో సిమెంట్ కంపెనీ ల అభివృద్ధికి పితామహుడు స్వర్గీయ బివి రాజు తో, తనకు అనుబంధం ఉందని అటువంటి మహానుభావుడు కృషితో,డబ్బు సంపాదన కోసం కాకుండా మంచి లక్ష్యంతో ఏర్పాటయిన ఈ విద్యాసంస్థలు జాతీయస్థాయిలో ఉన్నతస్థాయి చదువుతో పాటు అన్ని ఆధునిక వసతులతో.. ఖ్యాతి గాంచేలా మనవడు విష్ణురాజు ముందుకు తీసుకొనివెళ్ళడం అభినందనీయం అన్నారు. అమ్మాయిలను చదువులో విజ్ఞానం లో తక్కువ అంచనా వేసే రోజులు పోయాయని అయితే విదార్థినులు భారతీయ సంప్రదాయాలు పాటించాలని, కస్టపడి చదివిస్తున్న తల్లి తండ్రులు గర్వపడేలా అభివృద్ధిలోకి రావాలన్నారు. విదార్థినులు అడిగిన ప్రశ్నలకు తన అనుభవాలు రంగరించి చలాకీగా మార్గనిర్దేశ్యం చేసారు. ఈ కార్యక్రమం ముగింపులో వెంకయ్య నాయుడు అన్ని ప్రోటోకాల్ నిబంధలు ప్రక్కన పెట్టి విద్యార్థినులతో ఉత్సహపూరిత వాతావరణంలో స్వంత ఇంటి పెద్దాయన లా కలసిపోయి వారి మధ్యలో తానే స్వయంగా వెళ్లి వారితో మాట్లాడుతూ గుంపులు గుంపులు గా ఉన్న వారి మధ్య నిలబడి ఫొటోలు దిగుతూ అస్సిసులు అందజెయ్యడం జరిగింది. ట్రైన్ కు సమయం అవుతుండటం తో తప్పని సరి పరిస్థితిలో బయలు దేరుతున్నానని ఇక్కడి విదార్థినీలకు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మరికాసేపు గడపాలని ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం..
