సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: గోదావరి జిల్లాల ప్రజల ఇలవేల్పుగా ఉన్న అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం నిన్న శనివారం నేడు, ఆదివారం వేలాది భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచి సముద్ర పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు సోదరి గుర్రాలక్కమ్మ ఆలయాలను శ్రీ వసిష్ఠ ఆశ్రమం ను విశేషముగా దర్శించుకున్నారు. అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ని దర్శించుకున్న భీమవరం వాస్తవ్యులు బోడపాటి రవిశంకర్‌, భార్గవి దంపతులు రూ.50,116 దేవాలయంలో విందు భోజనం తరహాలో జరిగే నిత్యా అన్నసమారాధనకు అందించారు. శ్రీ అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మాఘ బహుళ ద్వాదశి ఈనెల 17న ఉదయం 10గంటలకు స్వామి వారికి శాంతికల్యాణం నిర్వహిస్తున్నారు. శాంతికల్యాణంలో పాల్గొనే భక్తులు ఆలయ వెబ్‌సైట్‌, ఆలయం వద్ద కౌంటర్‌లో టిక్కెట్లు ముందుగా తీసుకోవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *