సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: టర్కీ, సిరియాలో ఇటీవల సంభవించిన పెను భూకంపాల తీవ్రత కు పడిపోయిన భవనాల తొలగింపు ఇప్పట్లో పూర్తీ అయ్యలా కనపడటం లేదు. ఐతే ఇప్పటి వరకు దొరికిన మృతదేహాల ప్రకారం మృతుల సంఖ్య 30 వేలు దాటింది. ఇంకా శిధిలాలు క్రింద ఎంతమంది సజీవ సమాధి అయ్యారో? ఎంతటి విషాదం.. ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. అయితే ఈ కష్టకాలం లో తోడుగా ఉండి వందలాది భారత సైనికులు అందిస్తున్న సేవలను టర్కీ భూకంప బాధితులు కొనియాడుతున్నారు. అక్కడి హతాయ్ ప్రావిన్స్ లో ఏర్పాటు చేసిన 60 పారా ఫీల్డ్ ఆస్పత్రిలో భారతీయ ఆర్మీ విస్తృతంగా సేవలు అందిస్తోంది. 96 మంది భారతీయ వైద్య సిబ్బంది కూడా ఇక్క డ పనిచేస్తున్నారు. భూకంపం సంభవించిన ఆరు గంటల్లోనే అక్కడ ఏర్పాటు చేసిన ఈ కేంద్రం లో 800 మంది బాధితులకు వీరిలో 10 మందికి కీలక శాస్త్ర చికిత్సలతో పాటు ఇప్ప టిదాకా నిరంతరాయంగా ఆహారం , మందులు అందించడంతో పాటు సేవలు అందుతున్నాయి. తాత్కా లిక ఆసుపత్రిలో ఎక్స్ రే యం త్రాలు, వెంటిలేటర్లు, ఆపరేషన్ థియేటర్లు కూడా ఉన్నాయి.
