సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం నేడు బుధవారం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. వచ్చే మార్చి, ఏప్రిల్, మే నెలల ఆర్జిత సేవా టిక్కెట్లు నేడు విడుదల కానున్నాయి. నేటి సాయంత్రం 4 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. కాబట్టి ఆర్జిత సేవా టికెట్లను పొందాలనుకునే భక్తులు సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకొనే అవకాశం సద్వినియోగం చేసుకోండి.
