సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుస లాభాలతో దూసుకొనిపోయిన దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు ఊహించని విధంగా నేడు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఐటీ రంగంతో పాటు లోహాలు, కమోడీటీ షేర్ల అమ్మకాలు కొనసాగడంతో సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 893 పాయింట్ల నష్టంతో 76,200.28 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 278 పాయింట్ల నష్టంతో 23,824 వద్ద ముగిసింది. బ్యాకింగ్ రంగంలో అమ్మకాలు కనిపించడంతో మదపర్లుకు నష్టాలు మిగిలాయి.నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్‌కేర్ సూచీలు మాత్రం లాభాల్లో ముగిశాయి. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.10 శాతం, 0.58 శాతం మేర నష్టాలను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్ (0.95 శాతం), మారుతీ షేర్లు (0.07 శాతం) స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ, టాటా కన్సల్టెన్సీ షేర్లు నష్టాలతో ముగిసాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *